బ్రిటన్ యువరాజు విలియం, కేట్ దంపతులకు హిమాలయ రాజ్యం భూటాన్ ఘనస్వాగతం పలికింది. తమ దేశంలో పర్యటించాల్సిందిగా భూటాన్ రాజకుటుంబం విలియంను కొద్ది రోజుల క్రితం ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో విలియం తన భార్య కేట్ తో కలిసి భారతదేశం నుండి నేరుగా భూటాన్ వెళ్లారు. భూటాన్లో అడుగుపెట్టిన వెంటనే వారికి ఇద్దరు భూటాన్ చిన్నారులు పుష్పగుచ్చాలతో తమదేశంలోని స్వాగతం పలికారు. అంతకు ముందు భారతదేశ పర్యటనలో ఉన్న విలియం దంపతులు తమ పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా గడిపారు. బాలీవుడ్ టౌన్ ప్రముఖులను కలిశారు. సచిన్ తో కలిసి క్రికెట్ ఆడారు. ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రెండు రోజుల పాటు వారు భూటాన్లో గడుపుతారు. భూటాన్ రాజ దంపతులతో కలిసి విలియం దంపతులు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Mobile AppDownload and get updated news