ఐపీఎల్ 9వ సీజన్‌లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో ఢిల్లీ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్, పంజాబ్ జట్టు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కి మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట టాస్ గెలిచిన డేర్ డెవిల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు బ్యాటింగ్‌కి దిగింది. కిందామీదా పడుతూ 20 ఓవర్లపాటు ఆడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 9 వికెట్ల నష్టానికి కేవలం 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు పెద్దగా కష్టపడకుండానే 2 వికెట్లు నష్టపోయి కేవలం 13.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోగలిగింది. డేర్ డెవిల్స్ తరపున ఓపెనర్లుగా వచ్చిన డి కాక్, శ్రేయాస్‌లలో శ్రేయాస్ ఆదిలోనే ఔట్ అయినప్పటికీ... ఆ తర్వాత అతడి స్థానంలో వచ్చిన సామ్‌సన్‌తో కలిసి బాధ్యాతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు డి కాక్. 42 బంతుల్లో 59 పరుగులు(4x9, 6x1) చేసిన డి కాక్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Mobile AppDownload and get updated news