ప్రకాశం: వర్షపాతం తక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. శనివారం ఉదయం ఏపీ సీఎం ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సింగరాయకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, వ్యవసాయ మార్కెట్ యార్డులో కోల్డ్ స్టోరేజ్, ఉపాధిహామీ పథకం కింద నిర్మించిన సిసి రోడ్డును చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన నీరు-చెట్టు కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి.. చంద్రబాబు మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ లక్ష్యం నెలవేరాలంటే నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడం కూడా ప్రధానమైన అంశమన్నారు. నిటిని సమర్థవంతంగా వినియోగించుకుంటే కరవు నష్టాన్ని తగ్గించుకోవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి సిద్ధారాఘవరావు సహా నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా, సాంఘీక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్ బాబు, జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Mobile AppDownload and get updated news