వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానంతో ఒక వ్యక్తి తన భార్యపై యాసిడ్ పోశాడు. తీవ్రగాయాలపాలైన ఆ మహిళ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతగాడి కోసం గాలిస్తున్నామని మొరాదాబాద్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యశ్వీర్ సింగ్ చెప్పారు. ఆ మహిళకు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని చాలా రోజులుగా అతగాడు అనుమానిస్తున్నాడు. ప్రతీరోజు మాటలతోనూ శారీరకంగానూ హింసించేవాడు. ఇటీవల కూడా ఇదే అంశంపై వారిద్దరికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహం పట్టలేని అతగాడు తన దగ్గర గల యాసిడ్ ను ఆమెపై చిమ్మాడు. యాసిడ్ దాటికి శరీరం చిద్రమవుతూ కాలిపోతుంటే ఆ బాధ తట్టుకోలేక ఆమె పెద్దపెట్టున ఆర్తనాథాలు చేయడంతో అతగాడు అక్కడినుండి పరారయ్యాడు.
Mobile AppDownload and get updated news