దేశంలో రోజురోజుకు సైక్లింగ్ ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సైక్లింగ్ ద్వారా కాలుష్యాన్ని నివారించి హరితశోభను మరింత పెంచే లక్ష్యంతో సిమ్లాలో పర్వతారోహక సైక్లింగ్ ర్యాలీని నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ ర్యాలీలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సైకిలిస్టులు పాల్గొన్నారు. సైక్లింగ్ వల్ల మనిషి ఆరోగ్యం మెరుగవడం, శరీరం ఫిట్ గా ఉండటమే కాకుండా పర్యావరణ కాలుష్యం కూడా ఇబ్బడిముబ్బడిగా తగ్గుతుందని పర్యావరణ వేత్తలు ఈ సందర్భంగా తెలిపారు. వారంలో కనీసం ఒకటి రెండు రోజులైనా సైక్లింగ్ చేయాలని సూచించారు. ఈ ప్రపంచంలో వాతావరణ హితకారక రవాణా ఏదయినా ఉందంటే అది సైక్లింగేనన్నారు.
Mobile AppDownload and get updated news