యూఎస్ సెనెట్ బిల్లు వ్యవహరం ఇరు దేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. సెప్టెంబర్ 11న జరిగిన దాడుల నేరం సౌదీ ప్రభుత్వానికి ఆపాదిస్తూ నష్టపరిహారం చెల్లించాలని ఆ దేశాన్ని కోరాలని అమెరికా సెనెట్ బిల్లులో ప్రస్తావన ఉంది. ఇప్పటికే సెనెట్ జ్యుడిషియరీ ఈ బిల్లును పాస్ చేయగా..ప్రస్తుతం ఆ బిల్లు సెనెట్ పరిశీలనలో ఉంది. యూస్ సెనెట్ గనుక ఈ బిల్లు పాస్ చేస్తే యూఎస్ లోని సౌదీ లావాదేవిలన్నీ స్తంభించిపోతాయి. ఈ ప్రమాదం రాకముందే తాము స్పందించానలని సౌదీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి జుబైర్ ఈ అంశంపై స్పందిస్తూ ..అమెరికా సెనెట్ బిల్లు విషయంలో వెనక్కి తగ్గకపోతే తీవ్రపరిణామాల ఉంటాయని హెచ్చరించినట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. సౌదీకి వ్యతిరేకంగా ఎలాంటి బిల్లు పాస్ చేసినా.. యూస్ లోని సౌదీ పెట్టుబడులన్నీ ఉపసంహరించుకుంటామని ఒబామా సర్కార్ కు సౌదీ విదేశాంగశాఖ మంత్రి అబ్దుల్ జుబైర్ హెచర్చిక జారీ చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. గతంలో యూఎస్
ట్రజరీ సెక్యురిటీలను భారీగా కొనుగోలు చేసిన సౌదీ.. వాటన్నింటినీ విక్రయించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఒక వేళ సౌదీ ఆ పనిచేస్తే మొత్తం 750 బిలియన్ డాలర్లు విలువైన ట్రజరీ సెక్యూరిటీ
అమెరికా ప్రభుత్వం నష్టపోవాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన పెట్టుబడులను సౌదీ గనుక ఉపసంహరించుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
Mobile AppDownload and get updated news