నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కోసం నచ్శతిరా క్రికెట్ లీగ్ పేరిట నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ ఉదయం చెన్నైలోని మా చిదంబరం స్టేడియంలో ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 8 జట్టు పాల్గొంటున్నాయి. చెన్నై సింగమ్స్(కెప్టెన్-సూర్య), మదురై కాలైస్(కెప్టెన్- విశాల్), కోవై కింగ్స్( కెప్టెన్-కార్తి), నెల్లాయి డ్రాగన్స్(కెప్టెన్ - జయం రవి), రమ్నద్ రైనోస్(కెప్టెన్ - విజయ్ సేతుపతి), తంజై వారియర్స్( కెప్టెన్ జీవా), తిరుచ్చి టైగర్స్(కెప్టెన్ - శివ కార్తికేయన్), సేలం చీతాస్( కెప్టెన్ - ఆర్య) జట్లు పాల్గొంటున్న ఈ క్రికెట్ టోర్నమెంట్‌ని దగ్గరుండి ప్రోత్సహించేందుకు తమిళ సినీప్రముఖులతోపాటు కర్ణాటక నుంచి శాండిల్ వుండ్ సినీ ప్రముఖులు శివ రాజ్ కుమార్, టాలీవుడ్ నుంచి తెలుగు సినీ ప్రముఖులు నాగార్జున, బాలక్రిష్ణ, రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్ వంటి స్టార్స్ తరలివెళ్లారు.
![]()
కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి ప్రముఖులు హాజరైన ఈ టోర్నమెంట్‌కి అజిత్, విజయ్, ధనుష్, శింభు వంటి స్టార్స్ స్కిప్ అయ్యారు.
![]()
ఉదయం 9:30 నుంచి రాత్రి 10 గంటలవరకు ఈ మ్యాచ్‌లన్నింటినీ సన్ టీవీ లైవ్‌లో ప్రసారం చేయనుంది.
Mobile AppDownload and get updated news