గత కొన్ని రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఓవైపు, ఆ ఎండ వేడిమి కారణంగా ఏర్పడుతున్న ఉక్కపోతతో మరోవైపు సతమతమవుతున్న హైదరాబాద్ వాసులకి ఆదివారం కాస్త ఉపశమనం లభించింది. మధ్యాహ్నం వేళ మండుతున్న ఎండని పక్కకి పంపిస్తూ ఉన్నట్టుండి మేఘాలు కమ్ముకున్నాయి. అనుకోని అతిథిలా వచ్చిన వరుణ దేవుడు హైదరాబాద్ లోని కోఠి, ఆబిడ్స్, నాంపల్లి, లక్డీకాపూల్, అంబర్ పేట, బోడుప్పల్, కాప్రా, చర్లపల్లి, ఈసీఐల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాన్ని కుమ్మరించాడు. సాయంత్రం అయ్యేటప్పటికీ సిటీలోని మిగతా ప్రాంతాల్లోనూ వర్షపు చినుకులు హాయిగా పలకరించాయి. నిత్యం ఎండ వేడిమితో ఇక్కట్లు పడుతున్న నగరవాసులకి ఈ వర్షం కాస్తంత ఊరటనిచ్చిందనే చెప్పుకోవచ్చు.
Mobile AppDownload and get updated news