యాపిల్ మ్యాక్‌బుక్ మరింత అప్‌గ్రేడ్ అయింది. మరింతవేగమంతమైన ప్రోసెసర్ ఆప్షన్లు, ఎక్కువ సమయం నిలిచే బ్యాటరీ లాంటి వాటితో పాటు పలు ఆకర్షణీయమైన రంగులతో మరింత ఆధునాతనంగా సిద్ధమైంది. మ్యాక్‌బుక్ కాన్ఫిగరేషను అనుసరించి 1.1జీజీహెచ్ నుండి 1.3 జీజీహెచ్ వరకు గల ఆప్షన్లలో ఇంటెల్ 6వ తరం కోర్ ఎం ప్రోసెసర్లను ఈ బుక్కులో అప్‌డేట్ చేసారు. అంతేకాకుండా, మ్యాక్‌బుక్ మెమరీ సామర్థ్యాన్ని కూడా 1600ఎంహెచ్.జడ్ వెర్షను నుండి 1866ఎంహెచ్.జడ్ కు అప్‌గ్రేడ్ చేసారు. గ్రాఫిక్ కార్డును కూడా కళ్లు తిరిగే రేంజీలోకి మార్చారు. ఈ నేపథ్యంలో మ్యాక్‌బుక్ పనితీరు మరింత సమర్ధంగా, సూపర్‌ఫాస్ట్ వేగంతో ఉంటుందని యాపిల్ చెబుతోంది. ఇప్పటివరకు మ్యాక్‌బుక్ బ్యాటరీ సామర్థ్యం నెట్ బ్రౌజ్ చేసే సమయంలో 9 గంటలవరకు, సినిమాలు చూసే సమయంలో 10 గంటలవరకు ఉంది. దాన్ని గంట చొప్పున పెంచారు. ఈ నయా వెర్షన్ మ్యాక్‌బుక్ ఏప్రిల్ 20వ తేదీ (బుధవారం)నుండి రిటైల్ స్టోర్లలో, 19వ తేదీనుండి యాపిల్ ఆన్‌లైన్ స్టోర్స్‌లో విక్రయాలకు అందుబాటులో ఉంటుంది. దీని ధర ఆయా మ్యాక్‌బుక్ కాన్ఫిగరేషన్ వేరియేషన్స్ ప్రకారం 1299 డాలర్లు(రూ.85,929) నుండి 1599డాలర్ల (రూ.105726) మధ్యలో ఉంటుంది.
Mobile AppDownload and get updated news