చత్తీస్‌ఘడ్లో రోజురోజుకు మైనారిటీలపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఒక పాస్టరుతో పాటు గర్భవతి అయిన ఆయన భార్యపైకి గుర్తుతెలియని దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ రాష్ట్రంలోని బస్తర్ రీజియన్లో గల మారుమూల గ్రామమైన తోక్‌పాల్లో ఈ దారుణం చోటుచేసుకుంది. వారి చర్చిపైకి దాడి చేసిన దుండగులు అందులోని ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. విద్యుత్ ఉపకరణాలను నాశనం చేశారు. ఆయన కన్నబిడ్డలపై కూడా ఈ సందర్భంగా దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత పాస్టరు దీనానాథ్‌ను ఆయన భార్యను నడిరోడ్డుపై నిలబెట్టి వారిపైకి జై శ్రీరామ్ అనే నినాదాలు బిగ్గరగా చేస్తూ పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన జరిగి వారం రోజులు అవుతున్నా స్థానిక పోలీసులు ఏమాత్రం స్పందించలేదని ఆ రాష్ట్ర క్రిస్టియన్ సంఘం అధ్యక్షుడు అరుణ్ పన్నాలాల్ ఆరోపించారు. మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. స్థానికులు అడ్డుకోవడంతో పాస్టర్ కుటుంబం చివరి క్షణాల్లో ప్రమాదం నుండి బయటపడింది. ప్రస్తుతం వారు అజ్ఞాతప్రాంతంలో చికిత్స పొందుతున్నారు.
Mobile AppDownload and get updated news