పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలోని బామాన్ గచ్చి ప్రాంతానికి చెందిన సౌరవ్ చౌదరి అనే విద్యార్థికి రెండేళ్ల క్రితం తన ప్రాంతంలో జరుగుతున్న అక్రమ సారా వ్యాపారం, గూండాల దందా గురించి తెలిసింది. మిగిలిన వారికిలాగా అతను దాన్ని పట్టించుకోకుండా వదలివేయలేదు. స్థానికులను కూడదీసి వారి అక్రమ వ్యాపారాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించి ఊపిరాడనివ్వకుండా చేసాడు. దాంతో ఆగ్రహించిన ముఠా సభ్యులు ఆ విద్యార్థిని అపహరించి కిరాతకంగా హతమార్చారు. ఈ కేసులో మొత్తం పద్నాలుగు మందిని పోలీసులు అరెస్ట్ చేసి తొలుత విచారణ జరిపారు. కోర్టులో విచారణ సందర్భంగా ఎనిమిదిమందికి మరణ శిక్ష పడగా మరో ఐదుగురికి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. ఈ హత్యకేసు అప్పట్లో పెద్ద సంచలనమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి.
Mobile AppDownload and get updated news