Mobile AppDownload and get updated news
తెలుగురాష్ట్రాలు నిప్పుల కొలిమిలా ఉన్న సంగతి తెలిసిందే. అయితే... అందులో రాయలసీమ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అసలే కరవు ప్రాంతం కావడం... చెట్లు తక్కువగా ఉండడంతో సీమ ఎండ సెగలకి రాజుకుంటోంది. బయట అడుగుపెట్టడం సంగతి అలా ఉంచితే... ఇంట్లోనే ఉక్కపోతకి, వేడికి ప్రజలు ఉండలేకపోతున్నారు. వడదెబ్బ బారిన పడుతున్నారు. నాలుగు రోజులు నుంచి వడగాలులు వీయడం ఎక్కువైంది. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది. అనంతపురం, కర్నూలులో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. జలాశయాల్లో నీటి మట్టం కూడా తగ్గుతుండడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణాలో నిజామాబాద్, రామగుండం లలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల దాకా నమోదువుతున్నాయి. బంగాళాఖాతంలో తుపాను వ్యతిరేక పవనాలు ఏర్పడడం వల్లే... ఇలా ఒక్కసారిగా వడగాలులు వీస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.