దానిపై ట్విట్టర్లో నెటిజన్లు జోకులు వేసుకున్నారు.
**నిజమైన మోడీ మైనపు మోడీతో: హే.. చూసావా.. ఇప్పుడు భారతీయులకు ఇద్దరు మోడీలున్నారు. నువ్వు దేశంలో ఉండూ నేను ప్రపంచ దేశాలను పర్యటనలుగా చుట్టేసి వస్తాను.. మన ఇద్దరి తేడా ఎవరూ కనిపెట్టలేరు.
ఇంకో నెటిజన్ ఇలా ట్వీట్ చేసాడు.
**యూపీఏ ప్రభుత్వం చేయలేని ఘనకార్యాన్ని మోడీ సాధించారు. ఆయన మోడీని దేశానికి రప్పించారు.
**మోడీని వాళ్లు (మేడమ్ టుస్సాడ్ మైనపు విగ్రహతయారీ నిపుణులు) మరింత ఎత్తుగా, తెల్లగా తయారుచేశారు. అంతేకాదు ఇక ఆయన వెళ్లిన చోటల్లా శాశ్వతంగా చేతులు కిందకు దించకుండా నమస్కార భంగిమలోనే ఉండవచ్చని ఇంకొకతను చెప్పాడు.
**ఈ ఇద్దరిలో తండ్రెవరూ.. కుమారుడెవరో చెప్పలేక మీడియా బుర్రలు బద్ధలుకొట్టుకుంటోందంటూ ఇంకొక ట్వీట్ వాలా జోక్ చేసాడు.
Mobile AppDownload and get updated news