ఈ వార్త విన్న ప్రపంచం నిర్ఘాంతపోయింది. గాయపడిన ఐసిస్ తీవ్రవాదులను చంపేసి వారి శరీరాల్లోని అవయవాలను బయటకు తీయాలంటూ ఆ సంస్థ కొందరు వైద్యులను ప్రత్యేకంగా నియమించుకుందని అరబిక్ భాషా వార్తా పత్రిక అల్-సబాహ్ వెల్లడించింది. ఇటీవల సైన్యానికి ఐసిస్ కు జరిగిన పోరులో ఆ సంస్థ చేతుల నుండి ఇరాక్ దక్షిణాది ప్రాంతం చేజారిపోయింది. ఆర్థికంగా బాగా కీలకమైన ఆ ప్రాంతం చేజారిపోవడంతో ఐసిస్ లో డబ్బుకు లోటు ఏర్పడింది. దాంతో ఆ సంస్థ, అదే యుద్ధంలో ఇరాకీ సేనల చేతిలో గాయపడి ఓడిపోయి తనకు భారంగా మారిన తీవ్రవాదులను చంపేయాలని నిర్ణయించింది. చంపిన తరువాత వారి శరీరభాగాలను నల్లమార్కెట్లో విక్రయించి ఆదాయం పొందడం ప్రారంభించిందని ఆ వార్తా సంస్థ చెప్పింది. మోసుల్ నగరంలోని ఒక ఆసుపత్రిలో ఏకంగా 183మంది మృతదేహాలు గుట్టగా పడి ఉండటాన్ని ఇటీవల ఒక వ్యక్తి గమనించారు. అవయవాలను సేకరించిన తరువాత మృతదేహాలను ఒకచోట పడవేయడంతో ఆ ఆ శవాలగుట్ట ఏర్పడిందని ఆ ఆసుపత్రిలోని రహస్య సమాచార వర్గాలు తెలిపాయి.
Mobile AppDownload and get updated news