Mobile AppDownload and get updated news
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన 14వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొట్టమొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్‌కే మొగ్గుచూపింది. దీంతో మొదట బ్యాటింగ్‌కి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేయగలిగింది. అనంతరం 171 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మరో 2 ఓవర్లు మిగిలివుండగానే 6 వికెట్ల తేడాతో గెలిచి హోమ్ గ్రౌండ్‌లో మొట్టమొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై ఇండియన్స్ జట్టు గెలుపులో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. పార్థీవ్ వికెట్ పడిన తర్వాత రోహిత్-రాయుడులు బాధ్యాతాయుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో స్కోర్ కాస్త మెరుగుపడింది. 44 బంతుల్లో 62 పరుగులు(4x6, 6x3) సాధించిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. 19 బంతుల్లో 40 పరుగులు సాధించిన పొల్లార్డ్ ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు.