శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి ఓ భక్తుడు భారీ కానుకను అందించాడు. ఒడిశాకు చెందిన ట్రిజాల్ ఎంటర్ ప్రైజెస్ డైరెక్టర్ రాజేష్ కుమార్ అయిదున్నర కిలోల బంగారంతో హారాలను చేయించి శ్రీవారికి బహూకరించారు. వాటి ధర కోటి 15 లక్షల రూపయాలు ఉంటుంది. రెండు సుదర్శన సాలిగ్రామ హారాలను తయారుచేయించారు రాజేష్. వాటిని బుధవారం ఉదయం టీటీడీ ఈవో సాంభశివరావుకు అందించారు. ఆ రెండింటినీ ఉత్సవసమయాల్లో మూల విరాట్ కు, మలయప్పస్వామికి అలంకరించనున్నారు.
Mobile AppDownload and get updated news