Mobile AppDownload and get updated news
సినిమా హీరోలకు వీరాభిమానులు ఉన్నట్టే... రాజకీయపార్టీలకు కూడా పిచ్చి అభిమానులు ఉంటారు. అందులోనూ రాష్ట్రాల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన పార్టీలకు ఇలాంటి అభిమానులు సంఖ్య విపరీతంగా ఉంటుంది. అలాంటి అభిమాని తమిళనాడులోని కరుణానిధి పార్టీ అయిన డీఎంకేకి ఉన్నాడు. పేరు పి.రామన్. వయసు 40, కూలి పని చేసుకుని భార్యని, ఇద్దరు పిల్లల్ని పోషించుకుంటున్నాడు. తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరుగ బోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జయలలిత బహిరంగ సభ ఏర్పాటు చేసింది. రామన్ భార్యా, పిల్లలు ఆ సభకు హాజరయ్యారు. డీఎంకేను అభిమానించే రామన్... తన భార్యా, పిల్లలు ప్రత్యర్థి పార్టీ సభకు వెళ్లడం జీర్ణించుకోలేకపోయాడు. ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లగా తోటి కార్యకర్తలు కూడా ఆ విషయాన్ని అడిగారు. కొంతమంది గేలి చేశారు. దీంతో రామన్ లో కోపం మరింత పెరిగిపోయింది. బాగా తాగి సోమవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. అనంతరం తన గదికి వెళ్లి గడియవేసుకున్నాడు. భార్య ఉదయం లేచి గది తలుపు తీసేసరికి రామన్ ఉరివేసుకుని కనిపించాడు. రామన్‌కి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.