Mobile AppDownload and get updated news
గతేడాది రిలీజైన బాహుబలి ది బిగినింగ్ సినిమా జాతీయ స్థాయిలో రికార్డులు తిరగరాయడమేకాకుండా ఏకంగా జాతీయ ఉత్తమ చిత్రంగానూ నిలిచింది. మంగళవారం ఢిల్లీలో ఈ అవార్డ్ ప్రదానోత్సవం జరిగిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజమౌళిని అక్కడున్న మీడియా ఓ ప్రశ్న అడిగిందట. భవిష్యత్‌లో హాలీవుడ్ ప్రాజెక్ట్ ఏమైనా చేసే ఆలోచన వుందా అని అడిగిన మీడియాకు రాజమౌళి ఓ క్లారిటీ ఇచ్చాడని తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాలు డైరెక్ట్ చేసే ఆలోచనైతే ఏమీ లేదు కానీ మన దేశంలోనే ఎందరో రాజుల గొప్ప చరిత్రని తెరకెక్కించాలనేది తన ప్లాన్ అని చెప్పినట్టు సమాచారం. అశోక, అక్బర్, మహారానా ప్రతాప్ వంటి వాళ్ల కథల్ని సినిమాగా తెరకెక్కించాలని రాజమౌళి భావిస్తున్నాడు. గతంలో చెన్నైలో జరిగిన ఓ విద్యార్థి సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరై వారి సందేహాలకి సమాధానాలు ఇచ్చిన సందర్భంలోనూ రాజమౌళి ఇదే విషయాన్ని చెప్పారు. హాలీవుడ్ సినిమాలు తెరకెక్కించే విధానమే పూర్తి భిన్నంగా వుంటుంది. నేను ఆ స్టైల్‌కి సెట్ అవను అని రౌజమౌళి అప్పట్లోనే స్పష్టంగా చెప్పేశారు.