రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల పెండింగ్ ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీ
పురపాలకశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. బుధవారం ఉదయం మంత్రి గుంటూరు పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న 11 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగరపంచాయితీలకు ఎన్నికల నిర్వహరణకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు
జారీచేసినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీల్లోకి గ్రామాలను వీలీనం చేయడంతో.. దీన్ని సవాల్ చేస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారని మంత్రి వెల్లడించారు. ఈ కేసులన్నీ దాదాపు కొలిక్కి రాడవంతో ఈ మేరకు ఎన్నికల నిర్వహణ మార్గం సుగమమైందని మంత్రి నారాయణ వెల్లడించారు.
Mobile AppDownload and get updated news