Mobile AppDownload and get updated news
బాలీవుడ్ స్టార్ బిగ్ బీ పీకూ చిత్రానికి గానూ జాతీయస్థాయి అవార్డును అందుకున్నారు. మంగళవారం సాయంత్రం 63 వ జాతీయ చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఢిల్లీలో జరిగింది. రాష్ట్రపతి చేతుల మీదుగా విజేతలు పురస్కారాలని అందుకున్నారు. 73 ఏళ్ల అమితాబ్ నల్లటి సూట్ హూందాగా కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఆయన్ను 'లివింగ్ లెజెండ్' అని ప్రస్తావించారు. ఆ పిలుపు తాను చాలా ఆస్వాదించినట్టు బిగ్ బీ తెలిపారు. ట్విట్లర్లో 'ఉదయం 3.54 గంటలకి అవార్డుల వేడుక నుంచి వెనుదిరిగాను. కార్యక్రమంలో రాష్ట్రపతి నా పేరును పలకడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నారు. ఆయన పిలుపు నా మనసును తాకింది' అని ట్వీటు చేశారు. అమితాడ్ కార్యక్రమానికి భార్య జయా బచ్చన్, కొడుకు అభిషేక్, కూతురు శ్వేత నందా, కోడలు ఐశ్వర్యతో సహా పాల్గొన్నారు.