రోడ్డు మీద చెత్త మీద వేసేయడం, నీళ్లు పారబోసేయడం... చాలా సాధారణంగా జరిగే విషయాలు. ఇంట్లో కూరగాయలు కడిగిన నీరైనా, ఇంకేదైనా ఠక్కున రోడ్లు మీదకి విసిరేస్తుంటారు చాలా మంది. రోడ్డు పక్కన హోటళ్లు, షాపుల గురించి చెప్పక్కర్లేదు. వారి దుకాణాల నుంచి ధారాళంగా నీరు రోడ్డు మీదకి పారుతూ ఉంటుంది. ఇలాంటి నీటి వృథాకి, రోడ్ల అపరిశుభ్రతకి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంది హర్యానా ప్రభుత్వం. చుక్క నీరు నోరు చాచి ఎదురుచూస్తున్న గ్రామాలు ఎన్నో ఉండగా... కనీస జాగ్రత్త లేకుండా నీటిని పారబోసే వారికి శిక్షలు విధిస్తామని హెచ్చరించింది. జైలుకి పంపించడానికి కూడా సిద్ధమవుతోంది. రోడ్ల నిర్మాణంలో గ్రీన్ టెక్నాలజీని ఉపయోగిస్తోంది హర్యానా ప్రభుత్వం. ప్రస్తుతం అయిదు కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టింది. అయితే చాలా మంది గ్రామస్థులు నీటిని రోడ్లపై పారబోస్తుండడంతో అవి కొట్టుకుపోయి గుంతలు పడుతున్నాయి. అందుకే పై నిర్ణయాన్ని తీసుకుంది. ఒక్క్ బకెట్ నీళ్లు రోడ్డు మీద వేసినా రూ.10,000 దాకా జరిమానా కట్టాలి లేదా మూడు నెలలు జైల్లో ఉండాలి. త్వరలో ఈ నియమం అమల్లోకి రానుంది. ఎవరైనా రోడ్ల మీద నీరు పోయడం చూస్తే సదరు వ్యక్తి వాట్సాప్ లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తోంది.
Mobile AppDownload and get updated news