Mobile AppDownload and get updated news
కొన్ని గంటలుగా రైల్వే టికెట్లు బుక్ చేసుకునే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ హ్యాక్ అయినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే అలాంటిదేమీ జరగలేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర సైబర్ సెల్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించి సీడీలుగా తయారుచేసి రూ.15,000 అమ్ముతున్నట్టు మొదట తెలిపింది. దాంతో వెబ్ సైట్ హ్యాక్ అయినట్టు అందరూ భావించారు. దీనిపై ఐఆర్‌సీటీసీ పీఆర్‌వో సందీప్ గుప్తా మీడియాకు వివరణ ఇచ్చారు. వెబ్‌సైట్ హ్యాక్ అవ్వలేదని, డేటా మొత్తం చెక్ చేశామని చెప్పారు. వెబ్ సైట్ చక్కగా నడుస్తోందని, యథావిథిగా టిక్కెట్టు బుక్ చేసుకోవచ్చని అన్నారు. అయితే సైబర్ సెల్ చెప్పిన వివరాలపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని అన్నారు. అసలు విషయాన్ని కమిటీ తేలుస్తుందని అన్నారు. ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ల్ లో ఇప్పటి వరకు మూడుకోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. ప్రతి నెలా అయిదు లక్షల రైల్వే టిక్కెట్లు అమ్ముడవుతున్నాయి. ఇండియాలో ఇదే అతి పెద్ద ఈ కామర్స్ సైట్.