Ahhhhhhhhh!- The hottest I saw in my last 3 births pic.twitter.com/KQ0wIWC2ZJ
రాంగోపాల్ వర్మ సినిమాల్లో మహారాష్ట్రకి చెందిన హీరోయిన్లకి ప్రత్యేక స్థానం వుంది. ప్రముఖ అందాల తారలు ఉర్మిలా మటోండ్కర్, అంతరా మాలి, అమృతా కన్విల్కర్‌కి అవకాశాలు ఇచ్చి.. 'రాంగోపాల్ వర్మ హీరోయిన్లు' అని ఆడియెన్స్ వారికి ఓ సెపరేట్ ముద్ర వేసేలా చేశాడు వర్మ. రాధికా ఆప్టేకి కూడా రక్త చరిత్రలో హీరోయిన్‌గా అవకాశం కల్పించాడు. మళ్లీ ఇన్నాళ్లకి రాధికా ఆప్టే గ్లామర్‌పై మనసుపారేసుకున్నాడో ఏమో కానీ... "ఆహ్హ్హహ్హ్హ్.. నా చివరి మూడు జన్మల్లో ఇంత అందాన్ని చూడలేదు" అంటూ ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్ కవర్ పేజీకి ఆమె ఇచ్చిన ఫోజుని పోస్ట్ చేసి మరీ ట్వీట్ చేశాడు. బహుశా రాధికతో ఈ రాంగోపాల్ త్వరలోనే ఓ సినిమాకి ప్లాన్ చేసినా చేయొచ్చేమో!!
Mobile AppDownload and get updated news