మావోయిస్టుల ఏరివేతకు మహిళా దళం సిద్ధమైంది. కేవలం నక్సల్స్ వేటకే కాదు అవసరమైనప్పుడు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికీ ఈ దళం సర్వ సన్నద్ధంగా ఉంటుంది. సెంట్రల్ రిజర్వ్ పొలీస్ ఫోర్స్ 232వ మహిళా బెటాలియన్ కు చెందిన 567 మంది మహిళలు కఠోర శిక్షణ తీసుకున్నారు. ఆయుధాలతోనే కాదు, చేతిలో ఎలాంటి ఆయుధం లేకున్నా కూడా వీరు పోరాడగలరు. కరాటే, యుద్ధ విద్యల్లోనూ శిక్షణ తీసుకున్నారు. వీరిని మహిళా కమాండోలుగా చెప్పుకోవచ్చు. నలభై నాలుగు వారాల పాటూ వీరి శిక్షణ కొనసాగింది. ఇప్పుడు వారి శిక్షణ కాలం పూర్తవ్వడంతో అజ్మీర్ లో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. త్వరలో వీరు విధుల్లో చేరుతారు. తీవ్ర వాదం అంతానికి కృషి చేస్తామని మహిళలంతా ప్రతిజ్ఞ చేశారు.
Mobile AppDownload and get updated news