కర్నూలు జిల్లాను కరవు రహితంగా తీర్చిదిద్దుతానని ఏపీ సీఎం అన్నారు. కర్నూలు జిల్లాలో శనివారం చంద్రబాబు పర్యటించారు. పర్యటనలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన నీరు- చెట్టు కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నీటిని పరిరక్షించడం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అందరూ కలిసి నడుంబిగిస్తే కరవును ఎదుర్కోవడం సులభమౌతుందన్నారు. నీటిని ఆదా చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని కోసం భూములు ఇచ్చిన ప్రతీ రైతుకు తాను అండగా ఉంటాన్నారు. ప్రతీ రైతుకు న్యాయం చేసే బాధ్యత తనదేనన్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని గ్రామాలను స్మార్ట్ గ్రామాలు మార్చుతానని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
Mobile AppDownload and get updated news