ఈ 21 ఏళ్లలో ఆమె భగవంతుడిని కంటి చూపు ప్రసాదించమని కోరుకోని రోజు లేదు. కంటి చూపు లేని కారణంగా మేరీ యాన్ తన ఇంటిలో తడుములాడుతూ తిరిగేది. ఇటీవల అలాగే తడుములాడుతూ దేనికోసమో వెతుకుతుండగా కాలు జారి పడిపోయింది. దీంతో ఆమె మెడకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెన్నెముక నొప్పినుండి కాపాడేందుకు ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ అయిన మరుసటి రోజు తెల్లవారు జామున ఆమె కళ్లు తెరవగానే ఆమెకు ఎందుకో అంతా కొత్తకొత్తగా ఉంది. అప్పుడే బాలభానుడు తన లేలేత కిరణాలతో పైకి ఉదయిస్తున్న దృశ్యం ఆమెకు కనిపించింది. ఓహ్ మై గాడ్, ఇది నిజమా లేక కలా అనుకుంటూ ఆమె తన కళ్లను నలుపుకుంది. అనంతరం అది నిజమేనని తనకు చూపు వచ్చిందని నిర్ధారణ చేసుకుంది. కానీ, మనసులో ఏదో అనుమానం. దేవుడా దేవుడా ఇది కలకాకుండా చూడు తండ్రీ అంటూ ఎన్నో మొక్కులు మొక్కులు మొక్కుకుంది. ఆమె తిరిగి చూడగలుగుతున్న సంగతి మేరీ కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న వైద్యులు వచ్చి ఆశ్చర్యపోయారు.
ఇలా పోయిన చూపు తిరిగి దక్కడం అదీనూ రెండు దశాబ్దాల తరువాత అంటే అది కచ్చితంగా అద్బుతమేనని ఇది గతంలో ఎన్నడూ జరగలేదని ఆమెకు సర్జరీ చేసిన న్యూరోసర్జన్ డాక్టర్ జాన్ అఫ్సర్ చెప్పారు. ఇటీవల ఆమెకు ఆపరేషన్ చేసే సందర్భంలో వెన్నెముకకు కాస్త అదనంగా రక్తాన్ని ఎక్కించారు. ఆ సమయంలో వేగంగా ప్రవహించిన రక్త ప్రవాహం వెన్నెముకలో మూసుకున్న నాడీ మార్గాల్లోని అడ్డుకట్టలను తోసివేయడం లేదా కరిగించి వేయడం జరిగి ఉండవచ్చని.. దాంతో ఆమెకు తిరిగి కంటి చూపు వచ్చి ఉండవచ్చని విశ్లేషించారు. నాడీ వ్యవస్థలోని నాడులు బ్లాక్ అయిన సందర్భంలో అంధత్వం సంభవిస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. కంటి చూపు రావడానికి కారణాలేమైతేనేమి.. ప్రస్తుతం 70 ఏళ్ల ప్రాయంలో మేరీ మాత్రం ఇప్పుడు తన కుటుంబ సభ్యులను, మనవలు, మునిమనుమలను కూడా చూడగలుగుతోంది. ఇంకొక విశేషమేమిటంటే ఆమెకు గతంలో కలర్ బ్లైండ్ నెస్ సమస్య కూడా ఉండేది. ఇప్పడు అది కూడా ఆమెకు లేదు. అన్ని రంగులను ఆమె గుర్తించగలుగుతోంది.
Mobile AppDownload and get updated news