Mobile AppDownload and get updated news
అందరూ ఊహించినట్లుగానే ఆ పాకిస్థానీ సంతతి వ్యక్తే లండన్ నగరానికి తొలి ముస్లిం మేయర్ గా ఎన్నికయ్యారు. పాకిస్థాన్ నుండి చాలా కాలం క్రితం బ్రిటన్ కు వలస వెళ్లిపోయిన ఒక బస్సు డ్రైవర్ కుమారుడైన సాదిక్ ఖాన్ అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎదిగారు. లండన్ నగర వాసులకు సాదిక్ గురించి ప్రత్యేకించి వివరించనక్కరలేదు. అంతగా ఆయన అక్కడి ప్రజల ఆదరాభిమానాలను పొందారు. శుక్రవారం సాదిక్ కే లండన్ మేయర్ పదవని ఖరారయిపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల మేయర్లు ఆయనకు తమ అభినందనల సందేశాలను పంపడం మొదలుపెట్టారు. న్యూయార్క్ నగర మేయర్ బిల్ డి బ్లాసియో కూడా సాదిక్ కు తన అభినందనలు తెలిపారు. అయితే ఇంకా సాదిక్ కు ఎన్నికల సంఘం నుండి ఇంకా అధికారిక వర్తమానం అందలేదు. పుట్టుకతో ముస్లిం అయిన సాదిక్ ను ఆయన ప్రత్యర్థులు పలుమార్లు తీవ్రవాదిగా ఐసిస్ భావజాలం కలవాడిగా కూడా ఆరోపణలు గుప్పించారు. కానీ, అవేమీ ఓటర్ల మనసులను మళ్లించలేకపోయాయి.