Mobile AppDownload and get updated news
శ్రుతీహాసన్ తాను చేసిన ఆకతాయి పనికి ఇప్పుడు బాధపడుతోంది. ఒకతనితో పాటూ ఫోటో తీయించుకుని... తన భర్త అని అర్థం వచ్చేలా కామెంట్ రాసి కొన్ని రోజుల క్రితం ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్టు చేసిన శ్రుతీ హాసన్. కమల్ హాసన్ తో సహా అందరూ ఆ పోస్టు చూసి అదిరిపోయారు. ఆ తరువాత సరదాగా అంతా ఉత్తుత్తినే అనేసింది. కానీ ఆకతాయి పని తాలూకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తోంది. ఆమె అభిమానులు ఆ ఫోటోని మర్చిపోకుండా... నిజం పెళ్లయిందా మీకు, అతనా మీ భర్తా?, అంతకన్నా అందగాడు మీకు భర్తగా వస్తాడు కదా, అప్పుడే పెళ్లెందుకు చేసుకున్నారు? సినిమాలు మానేస్తారా? ఇలా ప్రశ్నలు మీద ప్రశ్నలు ఆమెకు పెడుతున్నారు. వారందరికీ సమాధానాలు చెప్పలేకపోతోంది శ్రుతి. నాకు పెళ్లి కాలేదు అని మొత్తుకుంటోంది. నన్ను నమ్మండి... అది సరదాగా చేసిన ట్వీట్ అని చెబుతోంది.