Mobile AppDownload and get updated news
ఢిల్లీ: ప్రధాని విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు ముమ్మాటికీ నకిలీవేనని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఆరోపించింది. మోడీ విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు అమిత్ షా మీడియా ముందు ప్రవేశపెట్టిన కొద్ది సేపటికే ఆప్ నేత అశుతోష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోర్జరీ చేసిన సర్టిఫికెట్లు చూపించినంత మాత్రానా నిజాన్ని సమాధి చేయలేరన్నారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏదో డిగ్రీని చూపించి.. అదే నిజమని అమిత్ షా చెబితే నమ్మడానికి జనాలు పిచ్చోళ్లు కాదన్నారు. ప్రధాని మోడీ విద్యార్హతలు గా అమిత్ షా చూపిస్తున్నది తప్పుడు సర్టిఫికెట్లన్నారు. నిజం నిప్పులాంటిదని ఆది ఏదో ఓ రోజు అగ్నిగుండంలా బయటపడుతుందన్నారు. అమిత్ షా, జైట్లీలు ఏదో చేయాలని భావించి.. అడ్డంగా దొరికిపోయారన్నారు. డిగ్రీలో ఆయన పేరు ఎలా మర్చుకున్నారో ప్రధాని మోడీ అఫిడవిట్ కాపీతో సహా చూపించాలని ఆప్ నేత అశుతోష్ డిమాండ్ చేశారు.