మంత్రి ఎంసెట్ ఫలితాలు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నీట్ పై తుది తీర్పు వెలువడగానే తీర్పు సారాంశాన్ని అధ్యయనం చేసిన అనంతరం ఫలితాలు
విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా ప్రకటించారు.అయితే ఈ విషయంలో విద్యార్ధులు,తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు. వాస్తవానికి
సోమవారం (ఇవాళ) మధ్యాహ్నం ఎంసెట్ ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. నీట్ తీర్పు తో ఈ అంశం ముడిపడినందున ఈ ఫలితాలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఒక వేళ నీట్ ద్వారనే వైద్య విద్య కోర్సుల సీట్లు భర్తీ చేయాలని తీర్పు వెలువడితే తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనే దానిపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది.
Mobile AppDownload and get updated news