ఢిల్లీ: ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్ల విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని ఢిల్లీ వర్శిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోడీ డిగ్రీ సర్టిఫికెట్లపై వివాదం నెలకొన్న నేపథ్యంలో మంగళవారం మీడియా మందుకు వచ్చిన ఢిల్లీ వర్శిటీ వీసీ ..ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్ పై క్లీన్ చీట్ ఇచ్చిన విషయం తెలిసిందే.అనంతరం బుధవారం రోజు ఢిల్లీ వర్శిటీని సందర్శించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు.. ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్ల అంశంపై వర్శిటీ వీసీతో చర్చించారు. అనతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఢిల్లీ వర్శిటీ బోర్డు ఇలాంటి ప్రకటన చేసిందని ఆప్ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ వర్శిటీ తాజాగా ఈ ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ప్రధాని విద్యార్హతలపై వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.. మోడీ డిగ్రీ సర్టిఫికెట్లు ముమ్మాటికీ నకిలీవని ఆప్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Mobile AppDownload and get updated news