'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంలో డిఫరెంట్ క్యారెక్టర్‌లో మెప్పించిన విజయ్ దేవరకొండ తాజాగా హీరోగా చేస్తోన్న కొత్త సినిమా పేరే ఈ 'అర్జున్ రెడ్డి'. ఈ చిత్రం మే 11న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. భ్రదకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ దర్శకత్వంలో ప్రణయ్ నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. షాలిని హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రారంభమైన రోజునే పస్ట్ లుక్ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. డిఫరెంట్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీతో రూపొందనున్న ఈ చిత్రం జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని హైదరాబాద్, మంగళూర్, డెహ్రడూన్, ఢిల్లీతో పాటు ఇటలీలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు రతన్ సంగీతాన్ని అందిస్తుండగా, నగేష్ బన్నేల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయ్ దేవర కొండ నటించిన 'పెళ్లిచూపులు' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు అర్జున్ రెడ్డి అనే డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.
Mobile AppDownload and get updated news