Mobile AppDownload and get updated news
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్, లంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేలు అంతర్జాతీయ క్రికెట్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. మూడేళ్ల పాటు వారు ఐసీసీ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. మరో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కమిటీకి చైర్మన్ గా మళ్లీ ఎన్నికయ్యారు. అంపైర్స్ ప్రతినిధిగా రిటైర్ అయిన స్టీవ్ డేవిస్ స్థానాన్ని రిచర్డ్ కెటిల్ బరో భర్తీచేసారు. అంపైర్ ఆఫ్ ద యియర్ అవార్డును గతంలో మూడు సార్లు గెలుచుకున్న రికార్డు కెటిల్ బరో సొంతం. దశాబ్దకాలంపాటు క్రికెట్లోని మూడు రకాల ఫార్మాట్లలోనూ ద్రావిడ్, జయవర్ధనేలు తమ సత్తా చూపి తమ దేశాలకు కీర్తిప్రతిష్టలు తెచ్చారు. టెస్టులు, వన్డేల్లోనూ 10వేలకు పైగా పరుగులు చేసిన ఘనత కూడా వీరి సొంతం. క్రికెటర్లుగా రిటైరైన తరువాత నుండి కామెంటేటర్లుగా మారి ఆ రంగంలో కూడా తమదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు.