తెలుగులో మరో హార్రర్ చిత్రం రాబోతోంది. వసుధైక 1957 ఈ చిత్రం పేరు. అరుణ శ్రీ కంబైన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్ర నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం ద్వారా బాల అనే యువ దర్శకుడు తెలుగు తెరపై తన ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. హైదరాబాద్ నగరంలో 1957వ సంవత్సరంలో చోటుచేసుకున్న యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించామని చిత్ర నిర్మాతలు తెలిపారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, అదుర్స్ రఘు, షాని బేబీ యోధ, కారుణ్య, పావని, శ్రీలత, సుభాష్ తదితరులు ముఖ్యపాత్రధారులు. చిత్రానికి సెన్సార్ కార్యక్రమం కూడా పూర్తయిందని ఈ నెలాఖరున విడుదల చేయనున్నామని అరుణశ్రీ కంబైన్స్ అధినేత నిడమలూరి శ్రీనివాసులు చెప్పారు. 1957లో ఐదు సంవత్సరాల వయసుగల చిన్నారి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రాన్ని నిర్మించామని, సస్పెన్స్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ లాంటి అంశాలన్నీ ఇందులో ఉన్నాయని దర్శకుడు బాల చెప్పారు.
![]()
Mobile AppDownload and get updated news