Mobile AppDownload and get updated news
మహారాష్ట్రలో కరవుతో సతమతమవుతున్న లాతూర్ ప్రాంతానికి రైల్వే శాఖ ఇప్పటి వరకు 6.20 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేసింది. ఇందుకైన ఖర్చు రూ. 4కోట్లుగా రైల్వేశాఖ లెక్కగట్టింది. ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ రైల్వే శాఖ నుండి లాతూర్ జిల్లా యంత్రాంగానికి బిల్లు వెళ్లింది. అయితే, ఈ బిల్లును తాము రైల్వే శాఖలోని రవాణా నిబంధనల మేరకే పంపించామని, అది కూడా లాతూర్ జిల్లా కలెక్టర్ సూచన మేరకే నీటి రవాణా ఖర్చు లెక్కించామని రైల్వే ఉన్నతాధికారి ఎస్.కె.సూద్ స్పష్టం చేసారు. ఈ బిల్లును చెల్లించాలో వద్దో జిల్లా ప్రభుత్వ యంత్రాంగమే నిర్ణయించుకోవాలన్నారు. ఒకవేళ ఆ బిల్లును చెల్లించకుండా ఉండాలని నిర్ణయిస్తే ఆ మొత్తాన్ని మాఫీ చేయాలని తమ శాఖకు గల నియమ నిబంధనలను అనుసరించి కోరవచ్చని తెలిపారు. నెల రోజులుగా లాతూర్ ప్రాంతానికి రైళ్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఆదుకుంటున్న సంగతి తెలిసిందే.