సిక్కుల ఆధ్యాత్మిక సంస్థ నిరంకారీ మిషన్ ప్రధాన గురువు బాబా హర్ దేవ్ సింగ్ కెనడాలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన వయసు 62ఏళ్లు. శుక్రవారం ఉదయం తెల్లవారు జామున ఆయన తన కారులో కెనడాలో ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని నిరంకారి మిషన్ తెలిపింది. టొరాంటో నగరంలో జూన్ నెలలో జరగాల్సిన అంతర్జాతీయ నిరంకారీ సమాగమం జరుగనున్న నేపథ్యంలో ఆయన కెనడాలోని పలు ప్రాంతాల్లో ఆధ్యాత్మిక సమావేశాల నిర్వహణలో ఉన్నారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ సంతాపం ప్రకటించారు. బాబా హర్ దేవ్ సింగ్ మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటుగా ప్రధాని అభివర్ణించారు. ఆయన మృతి పట్ల దేశ విదేశాల్లోని ప్రముఖులు కూడా తమ సంతాపాలను తెలియచేసారు.
Mobile AppDownload and get updated news