ముస్లింలకు ఉద్యోగాలిచ్చేందుకు ఆయుష్ మినిస్ట్రీ నిరాకరిస్తోందనే సంగతి తనకు సమాచార హక్కు చట్టం ద్వారా తెలిసిందని.. ఈ విషయాన్ని సాక్షాత్తు ఆయుష్ శాఖ ఉన్నతాధికారులు రాతపూర్వకంగా తనకు బదులిచ్చారంటూ మిల్లీ గెజెట్ పత్రికలో రాసిన వార్తలో శర్మ పేర్కొన్నారు. ఆ వార్త దేశంలో పెద్ద దుమారమే రేపింది. కేంద్రం మతపరమైన వివక్షను పాటిస్తూ మైనారిటీల జీవితాలతో ఆడుకుంటోందని విపక్షాలు భగ్గుమన్నాయి.
కాగా ఆ విషయాన్ని తాను అసలు చెప్పనేలేదని ఆయుష్ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టం కింద ఆయుష్ అధికారులు ఇచ్చిన జవాబుకు శర్మ తన పైత్యాన్ని జోడించి తాము చెప్పని విషయాలను సంచలనం కోసం రాసారని చెప్పింది. ఆయుష్ అధికారుల ఫిర్యాదు మేరకు కోట్లా ముబారక్ పూర్ పోలీసులు శర్మను అరెస్ట్ చేసి విచారించారు. ఆర్టీఐ ఇచ్చిందని శర్మ చెప్పిన సమాచార పత్రాలను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపారు. కాగా, ఇప్పటికీ శర్మ తన వాదనపైనే నిలబడ్డారు. తనకు ఆర్టీఐ ఇచ్చిన జవాబునే తాను వార్తగా రాసానని స్పష్టం చేస్తున్నారు.
Mobile AppDownload and get updated news