మాజీ క్రికెటర్ అజారుద్దీన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అజహర్. ఈ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను పొందింది. రివ్యూలు మాత్రం దాదాపు నెగిటివ్‌గానే వచ్చాయి. అయితే కలెక్షన్ల విషయంలో మాత్రం భారీగానే లాభపడింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మొదటిరోజే 6.3 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ సినిమాలో అజారుద్దీన్ పాత్రను ఇమ్రాన్ హష్మి పోషించారు. ప్రాచి దేశాయ్, నర్గీస్ ఫక్రీ హీరోయిన్లుగా నటించారు. అజార్ రెండో భార్య సంగీత బిజ్లానీగా నర్గీస్ నటించింది. రివ్యూలు, విమర్శులు పక్కన పెడితే కలెక్షన్లు బాగానే ఉండడంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉంది.
Mobile AppDownload and get updated news