Mobile AppDownload and get updated news
అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. ఈ నెల 16వ తేదీ (సోమవారం)న ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. పోటాపోటీ ప్రచారం నిర్వహించిన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇక తమ ప్రచారానికి స్వస్థి పలికి తుదిఘట్టమైన ఎన్నికల కోసం వేచి ఉండనున్నారు. ఇదిలా ఉండగా ఈ మూడు రాష్ట్రాల్లో దాదాపు ఎనిమిదిన్నర కోట్ల ఓటర్లు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతను నిర్ధేశించనున్నారు. కేంద్రపాలితప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 స్థానాలుండగా వాటికి మూడువందలమంది బరిలో ఉన్నారు. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా వాటికి 3,776మంది పోటీపడుతున్నారు. కేరళలో 140 స్థానాలకుగాను 1203మంది పోటీచేస్తున్నారు.