ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ``గురువారం విడుదలైన మా టీజర్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆయన సమకూర్చిన సంగీతం చిత్రానికి హైలైట్ అవుతుంది. ఈ నెల 22న పాటలను విడుదల చేస్తున్నాం. అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. అన్ని రకాల భావోద్వేగాలతో అన్ని వర్గాల ప్రేక్షకులూ చూసేలా పసందుగా ఉంటుంది. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం`` అని అన్నారు.
Mobile AppDownload and get updated news