"ఒక వ్యక్తిగా... నటుడిగా నాకు మా నాన్నగారు స్పూర్తి. ఆయన తర్వాత నాకు స్పూర్తినిచ్చిన వ్యక్తి మోహన్ బాబు గారే. క్రమశిక్షణతో, దృఢ సంకల్పంతో తాను అనుకున్న దారిలో ముందుకుసాగి స్వతహాగా గుర్తింపు పొందిన నటుడు ఆయన". ప్రముఖ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు గురించి మరో ప్రముఖ నటుడు, నట రత్న నందమూరి బాలక్రిష్ణ రాసిన వాక్యాలివి. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ ఇలా ఎన్నో బిరుదులని సొంతం చేసుకున్న మోహన్ బాబు సినీప్రస్థానం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవలే బ్రిటన్ పార్లమెంట్‌లో 'డైలాగ్ బుక్' అని ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు నటించిన 600 లకి పైగా చిత్రాల్లోంచి సేకరించిన డైలాగులతో రూపొందించిన ఈ పుస్తకంలో ముందుమాట పేజీల్లో మోహన్ బాబు గురించి బాలక్రిష్ణ రాసిన పేజీలోంచి కొంత భాగం మాత్రమే ఇది. మరి మోహన్ బాబు గురించి బాలయ్య బాబు ఇంకా ఏమేం అభిప్రాయాలు వ్యక్తపరిచారో తెలియాలంటే.. ఆయన రాసిన ఈ కింది పేజీని చదవాల్సిందే.
Mobile AppDownload and get updated news