Mobile AppDownload and get updated news
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ మూవీ మేకర్స్ ఈ నెలలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా అందించనున్నారు. ఇద్దరు స్టార్లు నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అభిమానులకి ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆ భాగ్యం దక్కనుంది. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఆ రోజు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్న మేకర్స్... ఇదే నెల 28న సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఫస్ట్ టీజర్‌ని విడుదల చేయనున్నారు. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ కానున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వారం రోజుల వ్యవధిలో ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్ చూసే అవకాశం రానుండటంపై అభిమానులు సైతం ఎంతో ఎగ్జైటింగ్‌గా వున్నారు.