ప్రముఖ రచయిత, నటుడు ఎల్.బి.శ్రీరామ్ నిర్మాతగా మారుతున్నారు. నాటక, సినీ రంగాల్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బి త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్ని మరింతగా అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. 'అరవై ఏళ్లలో' కూడా 'ఇరవై ఏళ్ల' ఉత్సాహంతో ఉన్న శ్రీరామ్ ఆ రెండు తరాల మధ్య వారధిగా అనేకానేక మానవతా విలువల్ని స్వచ్ఛందంగా ఆవిష్కరించేందుకే నిర్మాతగా మారినట్లు సమాచారం. అందులో భాగంగా తన పేరులో ఉన్న మొదటి రెండు అక్షరాల కలయికతో 'లైఫ్ ఈజ్ బ్యూటీపుల్' బ్యానర్‌పై షార్ట్ ఫిలింస్ రూపొందించి యూట్యూబ్‌లో రిలీజ్ చేసే ఆలోచనలో శ్రీరామ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యానర్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు ఎల్.బి శ్రీరామ్. నాలుగున్నర నిమషాల నిడివి ఉన్న ఆ టీజర్‌లో ఎల్.బి తాను తెరకెక్కించబోయే షార్ట్ ఫిలింస్‌కి సంబంధించిన విశేషాల్ని తనదైన స్టైల్లో వివరించారు. ప్రస్తుతం ఈ ప్రచార చిత్రం యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. మరి షార్ట్ ఫిలింస్ నిర్మాణంతో నిర్మాతగా మారతానంటున్న ఎల్బీ శ్రీరాం ఆ తర్వాతతర్వాత సినిమాలు కూడా నిర్మిస్తారా లేక షార్ట్ ఫిలింస్‌తోనే సరిపెట్టుకుంటారో తెలీదు కానీ ఆయన ప్రయత్నానికి మాత్రం మనం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదాం.
Mobile AppDownload and get updated news