కేరళలో అధికార పార్టీకి పరాజయం తప్పదని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని యూడీఎఫ్ ను కాదని.. వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ వైఫు ప్రజలు మొగ్గు చూపినట్లు తేల్చింది. మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో ఎల్డీఎఫ్ 78 స్థానాలు కైవసం చేసుకొని అధికార పగ్గాలు చేపట్టనుందని తేల్చింది. అలాగే ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న యూడీఎఫ్ 58 స్థానాలకే పరిమితమౌతుందని సర్వేలో తేలింది.అలాగే ప్రచారం సమయంలో అదరగొట్టిన బీజేపీ 2 స్థానాలు మాత్రమే దక్కనున్నాయి....కాగా ఇతరులు 2 స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు తేలింది. తాజా సర్వే ఫలితాలు ప్రస్తుత సీఎం ఉమెన్ చాందీకి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి.
Mobile AppDownload and get updated news