దేశంలో నెలకొన్న కరవు పరిస్థితులను సమీక్షించాలని ఇటీవలే సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అత్యున్నత ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధానిని కలిసి తెలంగాణలో నెలకొన్న కరవు పరిస్థితులపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సీఎంలకు మోడీ చర్చకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఛత్తీస్ గఢ్ సీఎంతో ప్రధాని మోడీ భేటీ నిర్వహించారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాగా ఈ భేటీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణులు, సహా రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Mobile AppDownload and get updated news