బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసు విచారణని త్వరితగతిన పూర్తి చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో బాంబే హైకోర్టు జూన్ 7న ఈ కేసుని విచారించనుంది. ట్రయల్ కోర్టు జియా కేసు విచారణ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించడమేకాకుండా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండానే విచారణ జరిపిస్తోందంటూ జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ సుప్రీంని ఆశ్రయించారు. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో దర్యాప్తు జరిపించాలని ఆమె కోర్టుని కోరారు. ఈ నేపథ్యంలోనే బాంబే హై కోర్టుకి సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. 2014లో ఈ కేసులో విచారణ జరిపిన సీబీఐ అప్పట్లోనే బాంబే హై కోర్టులో నివేదిక సమర్పించింది. అయితే, ఈ నివేదికని వ్యతిరేకిస్తూ రబియా ఖాన్ ఆ వెంటనే అదే కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో జియా ఖాన్ ఆత్మహత్యకి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు సూరజ్ పంచోలి 2013లో జూన్ 10న అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత జులై 2న హై కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.
Mobile AppDownload and get updated news