బెంగాల్ మినహా తమిళనాడు, కేరళ, అసోం,పుదుచ్చేరిలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు మార్పు వైపే మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది. ఒక్క పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో అధికార పార్టీలన్నీ ఓటర్ల తీర్పుతో కుదేలయ్యాయి. అసోంలో అధికారంలో ఉన్నకాంగ్రెస్ చతికీలపడింది. కేరళలో అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ కూటమి పరాజయం పొందినట్లు ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. తమిళనాట అమ్మను కాదని .. కరుణ వైపు తమిళ ఓటర్లు నిలబడటం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పవచ్చు. మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా అన్నాడీఎంకే ఓటమి పాలైనట్లు ఎగ్జిట్ పోల్ తెలిపింది. అయితే అంతిమ ఫలితాలు ఇలాగే ఉంటాయా లేదా ఏమైన మార్పులుంటాయా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఈ విషయం తేలాలంటే ఈ నెల 19న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచిచూడాల్సిందే మరి !
Mobile AppDownload and get updated news