ఢిల్లీ: పఠాన్ కోట్ దాడికి సూత్రధారి, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌కు ఇంటర్ పోల్ ..రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. పఠాన్ కోట్ ఉగ్రదాడిలో జైషే మహమ్మద్ సంస్థ పాత్ర ఉందని ఆధారాలతో సహా ఎన్ఐఏ నిరూపించడంతో ఈ మేరకు నోటీసులు జారీ అయ్యాయి. మసూద్ తో పాటు అతని సోదరుడు అబ్దుల్ రౌఫ్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్ 30న తెల్లవారుజామున పంజాబ్ లోని బమియాల సెక్టార్ లోని సరిహద్దు దాటిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదులు భారత్ లోకి ప్రవేశించారని .. పక్కా ప్లాన్ రెడీ చేసుకున్న అనంతరం ఉగ్రమూకలు పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడులు నిర్వహించినట్లు భారత్ చెబుతోంది. ఈ దాడిలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆధారాలను పాక్ కు పంపినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఇక ఉపేక్షిస్తే భవిష్యత్తులో మరిన్ని దాడులు జరగవచ్చని భావిస్తున్న భారత్ ఈ మేరకు ఇంటర్ పోల్ ను ఆశ్రయించి మసూద్ అజహర్ పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యేలా చేసింది.
Mobile AppDownload and get updated news