ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు టి. మంత్రి హరీష్ రావు మరోసారి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణలో నిర్మిస్తున్న ఆర్టీఎస్ ప్రాజెక్టుకు సహకరించాలని కోరారు. దీంతో పాటు తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో అభ్యంతరాలు ఉంటే చర్చించుకొని సమస్యను పరిస్కరించుకుందమన్నారు. రెండు రోజుల్లో సానుకూల నిర్ణయం వస్తుందని తాను ఆశిస్తున్నానని లేదంటే .. తెలంగాణ నుంచి ఎలాంటి సహాయం అందించబోమని తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎటూ తేల్చని ఇదే వైఖరినే ఏపీ కొనసాగిస్తే కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో రాయచూర్- కర్నూలు కలెక్టర్లకు మంత్రి దేవినేని లేఖ రాయడాన్ని హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో నిర్మించ తలపెట్టిన ఆర్టీఎస్ ప్రాజెక్టు సహా పలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే సుప్రీంను ఆశ్రయించేందుకు వెనుకాడబోమని మంత్రి దేవినేని స్పష్టం చేశారు.
Mobile AppDownload and get updated news