ఈ స్మార్ట్‌ఫోన్ కావలసిన వారు బి మై బ్యాంకర్ డాట్‌కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఐడి, పాస్‌వర్డ్‌ను పొందాలన్నారు. ఇందులో లాగిన్ అయ్యాక ఆన్‌లైన్ రూపంలో నగదు చెల్లించాలి. లైఫ్ టైమ్ మెంబర్ షిప్ కింద 199 రూపాయలు కూడా చెల్లించాలి. ఆ తర్వాత బీఎంబీ రెఫరెన్స్ ఐడి అందుతుంది. వాటి ఆధారంగా నమోటెల్ డాట్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఫోటో, ఆధార్‌కార్డును జతచేస్తే స్మార్ట్‌ఫోన్‌ను సరఫరా చేస్తామన్నారు. బి మై బ్యాంకర్‌లో సభ్యుడిగా చేరితే మాత్రమే నోవాటెల్‌లో రిజిస్ట్రేషన్ సాధ్యమన్నారు. ఫోన్ బుకింగ్స్ మొదలయ్యాయని namotel.comలో ఈ నెల 25 వరకు బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. మెంబర్ షిప్ ఫీజుకు, రిజిష్టర్ చేసుకుంటే ఫోన్ వస్తుందన్న దానికి గ్యారంటీ ఏమిటని విలేకరులు అడగగా ఆయన సమాధానం దాటవేశారు.
Mobile AppDownload and get updated news